RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 90 ఏళ్లు..! 4 d ago

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ని స్థాపించి నేటికి 90 ఏళ్లు పూర్తైంది. ఈ బ్యాంకును 1935వ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన స్థాపించారు. ఇది భారత దేశపు కేంద్ర బ్యాంకుగా గుర్తించబడింది. ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయం మొదట కోల్‌కత్తాలో ఉండేది. మార్పుల్లో భాగంగా ఆ తరువాత ముంబాయికి మార్చారు. మొదట ఈ బ్యాంకు ప్రవేటు వ్యక్తుల చేతుల్లో ఉండేది. అయితే 1949లో ఈ బ్యాంకును జాతీయం చేయడంతో భారత ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లింది. ఈ బ్యాంకుకు దేశ వ్యాప్తంగా 22 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.
ఆర్థిక నైపుణ్యం గల వ్యక్తులను ఈ బ్యాంకుకు అధిపతులుగా నియమిస్తారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో రిజర్వ్ బ్యాంకుకు గవర్నర్ గా పని చేశారు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించారు. ఈ బ్యాంకులో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ప్రధాన కమిటీ ఉంటుంది. భారత ప్రభుత్వం నాలుగు సంవత్సరాల కాలానికి గాను డైరెక్టర్లను నియమిస్తుంది. బోర్డులో ఒక గవర్నర్ ఉంటారు. రిజర్వ్ బ్యాంకుకు గవర్నర్ అధిపతిగా ఉంటారు. ఇతనిని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అని పిలుస్తారు. ప్రాంతీయ బోర్డులకు ప్రాతినిధ్యం వహించడానికి నలుగురు డైరెక్టర్లు ఉంటారు.